కర్నూల్ లో ఓపెన్ ప్లాట్ కొనా లనుకుంటున్నారా? లేదా ఏదైనా వెంచర్ లోని ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేద్దమనుకుంటున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. అదే LP APROVALS. lp అంటే లేఔట్ పర్మిట్ . ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా లేదా ఒక వ్యక్తి తన భూమిని ప్లాట్ లు చేసి అమ్మాలన్న ఈ లేఔట్ పర్మిట్ చాల అవసరం.
అసలు ఈ లేఔట్ పేర్మింట్ ఎవరిస్తారు? లేఔట్ పేర్మింట్ ఉన్న ల్యాండ్ కొంటే లాభమేంటి? LP లేకుండా ఉన్న ప్లాట్ లు కొంటె వచ్చే నష్టాలేంటి? ఈ విధమైన అంశాలన్నీ ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఈ లేఔట్ అప్రూవల్ ఎలా ఇస్తారో చూదాం. ఎక్కడైతే వెంచర్ వేస్తున్నామో, ఆహ్ భూమిని నిర్దేశిత గవర్నమెంట్ అధికారి తనిఖీ చేస్తారు. ఆహ్ భూమి డెవలప్మెంట్ కి అనుగుణముగా ఉందొ లేదో చెక్ చేస్తారు . అంతేకాక రోడ్ వెసులుబాటు, పార్క్, ప్లోట్టింగ్ విధానం మరియు మరెన్నో తనిఖీలు జరిపి చివరగా ఒక LP నెంబర్ ని అలాట్ చేస్తారు. ఇక అదే నెంబర్ ఫైనల్ అంతటితో ఆ వెంచర్ పూర్తి స్థాయిలో అధికారికంగా అప్ప్రోవ్ చేయబడింది అని అర్థం.
లేఔట్ పర్మిట్ ఉన్న ప్లాట్ కొంటె లాభమేంటి?
మరి ఇప్పుడు ఈ లేఔట్ పర్మిట్ ఉన్న ప్లాట్ కొంటె లాభమేంటి? లేఔట్ పర్మిట్ లేనివి కొంటె వచ్చే నష్టాలేంటో చూద్దాం.
మొదటగా ప్రోపెర్ టైటిల్ . LP అప్రూవల్ ఉన్న ల్యాండ్ కి ప్రోపెర్ టైటిల్ ఆండ్ డెడికేటెడ్ LP నంబర్స్ ఉంటాయి. కాబట్టి బిల్డింగ్ అప్ప్రోవల్స్ మరియు స్పాట్ రెజిస్ట్రేషన్స్ చాలా సులువుగా అవుతాయి.
కానీ LP అప్ప్రోవల్స్ లేని వాటికీ టైటిల్స్ అండ్ నంబర్స్ ఉండవు. కాబట్టి బిల్డింగ్ అప్ప్రోవల్స్ కష్టం అవుతుంది.
రెండవది కస్టమర్ బెనిఫిట్స్, LP అప్ప్రోవల్స్ ఉన్న ల్యాండ్ లో 52% మాత్రమే ప్లోట్టింగ్ వేస్తారు, మిగతా 48% కస్టమర్ బెనిఫిట్స్ అంటే పార్క్ ఏరియా,గ్రీనరీ, 30 – 40 ఫీట్ రోడ్ మొదలగునవి. కానీ non lp లో 70% ప్లోట్టింగే వేస్తారు మరియు కస్టమర్ ఏరియా ప్రిఫెరెన్సు ఉండదు.
అమ్మకాలు కొనుగోళ్లు
మూడవది అమ్మకాలు కొనుగోళ్లు, లేఔట్ పర్మిట్ ఉన్న ల్యాండ్ రేట్ అతి తక్కువ కాలం లోనే ఎక్కువ ధరకు పెరిగే అవకాశం ఉంటుంది మరియు అత్యంత సులువుగా అమ్ముకొనే సదుపాయం ఉంటుంది. కానీ non lp లో అలా ఉండదు.
ఇక నాల్గవది, బ్యాంకు లోన్లు: LP అప్రూవల్ ఉన్న ప్లాట్ లేదా హౌస్ కి బ్యాంకు లోన్స్ ఇంటికొచ్చి మరీ ఇస్తారు, మీరు చేయవల్సిందల్లా ఆన్లైన్ లో మంచి వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకు ని ఎంచుకుని అప్లై చెయ్యడమే. కానీ non lp ల్యాండ్ కి లోన్ కావాలంటే చెప్పులు అరిగేలా బ్యాంకు ల చుట్టూ తిరగాల్సిందే.
చూసారుగా ఇన్వెస్టర్స్, ఇక ముందు ల్యాండ్, ప్లాట్ లేదా హౌస్ కొనే ముందు ఈ చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందడుగేస్తే మీ పెట్టుబడులు వృధా కావు.