కర్నూల్ లో ఓపెన్ ప్లాట్ లేదా ఏదైనా టౌన్షిప్ లో ఇండిపెండెంట్ హౌస్, వీటిలో మీ ఆలోచన ఏదైనా సరే ముందుగా కొద్దిపాటి పరిశీలన అవసరం. అందులో భాగమే ఈ KUDA అప్రూవల్.
అసలు ఈ KUDA అంటే ఏంటి? నేను డబ్బులు పెట్టి కొంటున్నాను,అమ్మేవాళ్ళు డబ్బులు తీసుకునే అమ్ముతున్నారు. మధ్యలో ఈ kuda అప్రూవల్ ఎందుకు? అని మీకు సందేహం రావచ్చు.
KUDA అంటే Kurnool Urban Development Authority. ఇది 2016 ఫెర్బ్రవరి 1st న అర్బన్ డెవలప్ అథారిటీ ఆక్ట్ 2016 కింద అమలు పరచపడింది. ఇందులో భాగంగా కర్నూల్ మునిసిపల్ కార్పొరేషన్, నంద్యాల మునిసిపల్ కార్పొరేషన్, గూడూరు నగర్ పంచాయత్ మరియు 8 మండలాల లోని 111 గ్రామాలని చేరుస్తు కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబడింది.
ఈ KUDA పరిధిలో పొందుపరచబడిన మునిసిపాలిటీల పరిధిలో ఏ వెంచర్ వేయాలన్న, ఈ kuda అథారిటీని సంప్రదించి తగిన పరీశీలనలు చేయించుకుని అప్రూవల్స్ తీసుకోవలసి ఉంటుంది.
అప్పుడు మాత్రమే ఆ వెంచర్ కి మిగతా అనుమతులు, అమ్మకాలు కొనుగోళ్లు, లేఔట్ లు లభించును.
ప్లాట్ కి KUDA అప్రూవల్ లేకపోతే?
KUDA అనుమతులు లేని లేఅవుట్ లలో ప్లాట్ లు కొనడం వల్ల , భవిష్యత్తులో సమస్యలు తలైతే అవకాశం లేకపోలేదు.
అవి ఎలా ఉండొచ్చు అంటే, మీరు తీసుకునే ప్లాట్ కి కానీ ఇంటికి కానీ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు లోన్ సంబంధిత వ్యవహారాలలో ఇబబందులు ఎదుర్కొనవచ్చు. మోర్ట్ గేషన్ అవసారాలుకు త్వరిత గతిన అనుమతులు పొందలేకపోవచ్చు.
కావున కర్నూల్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ జాగ్రత్తను పాటించండి .